close
close

Polling Percent | త్రిపురలో 53.04%.. లక్షద్వీప్‌లో 29.91%‌.. రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా-Namasthe Telangana

Polling Percent | మధ్యాహ్నం 1 గంట వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది (Polling Percent).


Polling Percent | త్రిపురలో 53.04%.. లక్షద్వీప్‌లో 29.91%‌.. రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా

Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇక మధ్యాహ్నం 1 గంట వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది (Polling Percent). ఆ రాష్ట్రంలో 53.04 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్‌లో (Lakshadweep) 29.91 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపింది.

మధ్యాహ్నం 1 గంట వరకూ రాష్ట్రాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా..

 • అండమాన్‌ నికోబార్‌ దీవులు : 35.70 శాతం
 • అరుణాచల్‌ ప్రదేశ్‌ : 35.75 శాతం
 • అస్సాం : 45.12 శాతం
 • బీహార్‌ : 32.41 శాతం
 • ఛత్తీస్‌గఢ్‌ : 42.57 శాతం
 • జమ్మూ కశ్మీర్‌ : 43.11 శాతం
 • లక్షద్వీప్‌ : 29.91 శాతం
 • మధ్యప్రదేశ్‌ : 44.43 శాతం
 • మహారాష్ట్ర : 32.36 శాతం
 • మణిపూర్‌ : 46.92 శాతం
 • మేఘాలయా : 48.91 శాతం
 • మిజోరాం : 37.43 శాతం
 • నాగాలాండ్‌ : 39.66 శాతం
 • పుదుచ్ఛేరి : 44.95 శాతం
 • రాజస్థాన్‌ : 33.73శాతం
 • సిక్కిం : 36.82 శాతం
 • తమిళనాడు : 39.51 శాతం
 • త్రిపుర : 53.04 శాతం
 • ఉత్తరప్రదేశ్‌ : 36.96 శాతం
 • ఉత్తరాఖండ్‌ : 37.33 శాతం

Also Read..

Manipur | మణిపూర్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పుల కలకలం.. భయంతో పరుగులు తీసిన ఓటర్లు

Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం

Arvind Kejriwal | నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్‌ కేజ్రీవాల్‌Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *